బ్లాగు మిత్రులకు జయహో . నన్నూ మీ జట్టులోకి చేర్చుకోండి . డిసెంబర్ 12 తెలుగు బ్లాగుల దినోత్సవం అని ఎవరో మిత్రుడు చెబితే విన్నాను. ఈ శుభ దినోత్సవం రోజున నేను ఓ బ్లాగు ప్రారంభిస్తున్నాను. నా అభిప్రాయల మాలికలా దీన్ని తీర్చిదిద్దుతాను. మన చుట్టూ జరిగే పరిణామాలను వీలైనంత మేరకు అందజేయాలని ఈ బ్లాగు మొదలెడుతున్నాను. ప్రత్యేకించి విద్యార్థులు, యువతను లక్ష్యంగా నా అభిప్రాయాలు పంచుకోదల్చాను. సినిమాలు, యువత భావాలు, శృగారం, సమస్యలు, మానసిక వేదన, ర్యాగింగ్, ఇంజనీరింగ్ గొడవలు, ఐటి ఉంటుందా..ఊడుతుందా..కాలేజీల్లో జరుగుతోందేంటి. ఓయు, ఎస్కేయు, కాకతీయ, ఆంధ్రా పరిణాలేంటి, రాజకీయాల సుడిగుండాలేంటి. అన్ని అంశాలు చర్చనీయాంశాలే. వీటన్నింటి ఒక్కొరిది ఒక్కొ దృక్ఫథం ప్రతి ఆలోచన వెనుక ఓ ప్రతిఫలం. ఏ ప్రతిఫలం ఆశించని పిచ్చాపాటి సరదా. అన్నింటి సమ్మిలిత భావాల గులిక కావాలని నా బ్లాగును ఆశీర్వదించండి.